భాజపా తీరు బాగాలేదు : సుజనా చౌదరీ

భాజపా తీరు బాగాలేదు : సుజనా చౌదరీ
March 22 18:09 2018

న్యూఢిల్లీ,
పార్లమెంట్ లో ఎంపీలంతా చర్చ జరపాలని అనేక విధాలుగా నిరసన తెలుపుతున్నాం. సభ సజావుగా జరగడం లేదని వాయిదా వేస్తున్నారు. కానీ వాళ్ళ బిల్ లు మాత్రం పాస్ చేసుకుంటున్నారని ఎంపీ సుజనా చౌదరీ అన్నారు. గురువారం అయన పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. సభ వాయిదా పడిన తర్వాత ఎంపీలందరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ని కలిసాం. సభ్యులు ఎంత మంది ఉన్నారో కనపడలేదు అనే బదులు సమయం ఇచ్చి సభ్యులు ను లెక్కపెట్టచ్చు కదా. స్పీకర్ సుమిత్రా కూడా పోసిటివ్ గా స్పందించలేదని అన్నారు. అవిశ్వాస తీర్మానం ఇస్తే చర్చ మొదలు అవుతుంది.అంతే బీజేపీ కి ఎలాంటి నష్టం ఉండదు. తీర్మానం పెడితే ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలు తెలుపుతారు. ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్లలో అర్థం కావడం లేదు. పార్లమెంట్ ఒక దేవాలయం లాంటిది. పార్లమెంట్ లోనే మాకు న్యాయం జరగడంలేదని అయన విమర్శించారు. అన్ని మార్గాలలో మేము ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని పార్టీలు ఈ విదంగా ఆందోళన చేయడం బాధాకరం. అధికారాన్ని మేము ప్రశ్నించడం లేదు. న్యాయంగా సభ లో గోల చేస్తున్న వారిని సస్పెండ్ చేసే అధికారాలు స్పీకర్ కి ఉన్నాయి. గతంలో కూడా మీనాకుమారి ఇదే తరహలో సస్పెండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని 2 రోజులు కు సస్పెండ్ చేస్తే సరిపోతుంది. అవిశ్వాస తీర్మానం చాలా అరుదుగా వస్తుంది. స్పీకర్ ఆందోళన చేస్తున్న సభ్యులు కు క్రమ శిక్షణ లేదు అని సస్పెండ్ చెయ్యచ్చు. మేము వారిని సస్పెండ్ చేయండని మేము ఏమి చెప్పడం లేదు.మాకు ఆ అధికారం కూడా లేదని అన్నారు. అవిశ్వాస తీర్మానం కోసం బీజేపీ పారిపోతుందని అనడం సబబు కాదు.కానీ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు బాలేదని అయన విమర్శించారు.