చంద్రబాబు అడగలేదు : సుధీశ్ రాంబొట్ల

చంద్రబాబు అడగలేదు :  సుధీశ్ రాంబొట్ల
March 23 17:00 2018

విజయవాడ,
ఈ మధ్య టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరోగితే తప్పేంటని బీజేపీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంబొట్ల ప్రశ్నించారు. బీజేపీ పవన్ తో ఆడిస్తుంది.. జగన్ తో కుమ్మక్కైంది అనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి పొడిగించలేదని అయన స్పష్టం చేసారు. కేవలం ఆ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు విడుదల చేసారు. అదికూడా నీతి ఆయోగ్ ప్రతిపాదనలతోనే ఇచ్చారు. నీతి ఆయోగ్ కమిటీలో చాలామంది ముఖ్యమంత్రులు వున్నారు. చంద్రబాబును ఉండాలని కోరినా తిరస్కరించారని అన్నారు. కానీ అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకున్నాం.. అప్పుడు చంద్రబాబు ఏపీకి ఏం కావాలో కోరుకోలేదు. ఇతర రాష్ట్రాలకంటె ఏపీకి ఎక్కువ ఇచ్చామని అన్నారు. కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిధులు ఎక్కువ ఇస్తున్నాం అనేది అవాస్తవం. ఇతర రాష్ట్రాలకు 30లక్షల కోట్లిస్తుంటే కర్ణాటకకు 14 లక్షల కోట్లే ఇచ్చారు. ఇందిరాగాంధీ ని ఎదుర్కొన్నది చంద్రబాబు కాదు. బీజేపీ. టీడీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అయన అన్నారు. సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ అడిగితే మోడీ ఇవ్వలేదనేది అవాస్తవం. పట్టిసీమ ప్రాజెక్టు మంచిదే.. కానీ అవినీతి జరిగిందనేది వాస్తవమని అయన అన్నారు. ఆపరేషన్ గరుడ, ద్రవిడ అవాస్తవాలు. అదంతా ఒక ఫ్లాప్ హీరో ఊహాజనితాలు. కారెం శివాజీ మాదిరిగా ఈ శివాజీకి కూడా ఏదో పదవి వచ్చేవరకూ ఇలాగే చేస్తుంటాడని అయన అన్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదు. బీజేపీని తిడతారనుకుని టీడీపీ నేతలే పవన్ మీటింగ్ కి జనాన్ని తరలించారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిందని అయన అన్నారు.