పవన్ కోసం భరత్ అను నేను ప్లాన్ చేశాను

పవన్ కోసం భరత్ అను నేను ప్లాన్ చేశాను
March 22 18:26 2018

హైద్రాబాద్,
మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భరత్ అను నేను’. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రానికి కథ అందించిన శ్రీహరి నాను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాసినట్లు చెప్పారు. 2014లో పవన్ ‘జనసేన’ పార్టీ ప్రారంభించిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిదందన్నారు. పవన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఊహించి ఈ కథ రాశానన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్‌‌ను కలిసి స్టోరీలైన్ వినిపించానని తెలిపారు. అయితే, తాను పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ సబ్జెక్ట్‌ను ప్రజలు తప్పుగా భావించే అవకాశాలున్నాయని పవన్ తెలిపారన్నారు. తాను సీఎం అవ్వాలనే కాంక్షతోనే పార్టీ పెట్టానని అనుకుంటారని పవన్ అన్నారని తెలపారు.రచయిత, దర్శకుడు కొరటాల శివ.. శ్రీనుకు రూ.కోటి చెల్లించి కథను తీసుకున్నట్లు తెలిసింది. పవన్ కొన్ని మంచి కథలను మిస్సవ్వడం ఇదే తొలిసారి కాదు. పూరీ దర్శకత్వం వహించిన ఇడియట్, అమ్మా నాన్న తమిళ్ అమ్మాయి, పోకిరి సినిమాలను కూడా పవన్ వదులుకున్నాడు. ఆ సినిమాలన్నీ ఏ స్థాయిలో హిట్టయ్యాయో తెలిసిందే. మరి, ‘భరత్ అను నేను’ కూడా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.