రాష్ట్రం లో తగ్గిన రైతు ఆత్మహత్యలు..హరీష్ రావు

రాష్ట్రం లో తగ్గిన రైతు  ఆత్మహత్యలు..హరీష్ రావు
March 23 18:06 2018

హైదరాబాద్
బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర, కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్నాటకలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆర్థికపద్దులపై చర్చ సందర్భంగా శాసనసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు స్వయంగా కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారు. మనది రైతు ప్రభుత్వం కాబట్టే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గతేడాది కంటే 53 శాతం తగ్గినయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం పటిష్టమైన విధానం అమలు చేస్తున్నామన్నారు. కొత్తగా పలువురు ఇంజినీర్లను నియమించినట్లు హరీశ్‌రావు తెలిపారు. పంట పెట్టుబడి ఇస్తామనడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్ల మీద కోర్టులో కేసులు వేసి న్యాయస్థానాలను పక్కదోవ పట్టించిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

  Article "tagged" as:
  Categories: