అవమానాలు సహించాం : మంత్రి సోమిరెడ్డి

అవమానాలు సహించాం : మంత్రి సోమిరెడ్డి
March 23 17:05 2018

అమరావతి,
2015 ఎన్నికల్లో నే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపరేషన్ 7 స్టేట్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఆపరేషన్ గరుడ, ద్రవిడ, కుమార అని ఎన్నో ఆ జరుగుతున్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో టీడీపీ తో పొత్తు లేదని బిజెపి చెప్పిన రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి నేతలకు మద్దతు ఇచ్చాం. వైసీపీ నేతలు లోపల కౌగిలింతలు.. బయట స్టేట్మెంట్ లు ఇస్తున్నారని విమర్శించారు. బీజేపీ కి అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తే పదకొండు రాష్ట్రాలకు ఒక న్యాయం. . మా రాష్ట్రానికి ఒక న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. అమిత్ షా, మోడీ ద్వయం మిత్ర ధర్మానికి తూట్లు పొడిచారు. మిత్ర ధర్మానికి విలువనిచ్చిన నాయకులు వాజపేయి, దేవ గౌడ్ అని అన్నారు. ఎన్డీఏ నుండి బయటకు వస్తే ఈ కక్ష సాధింపు చర్యలా. బీజేపీని ఓడించాలని చూసిన జగన్ మోహన్ రెడ్డి ని పక్కలో పడుకో పెట్టుకుంటరా అని నిలదీసారు. రాష్ట్రం కోసం అన్ని పరీక్షలు, అవమానాలను సహించామని అయన అన్నారు.