గ్లామర్ డాల్ గా కాజల్

గ్లామర్ డాల్ గా కాజల్
March 16 16:34 2018

హైద్రాబాద్,
కాజల్ అందాలు ఎలా చూపించాలి అనుకుంటుందో అలానే చూపించేస్తుంది. తానెప్పుడూ అందాల ఆరబోతకు వ్యతిరేఖి కాదు. కథ డిమాండ్ ను బట్టి సినిమాలో తన గ్లామర్ షో చేస్తుంది. అందుకే ఇన్నాళ్లయినా ఇండస్ట్రీలో నిలబడగలిగింది. బుల్లి ఫ్రాక్స్ వేసినా…. లంగా వోణి వేసినా… అలాగే చీర కట్టులో కూడా తనదైన స్టయిల్లో అందాలు ఆరబొయ్యగల సామర్థ్యం ఉంది కాజల్ కి. అందుకే కాజల్ ఎప్పుడూ చక్కని గ్లామర్ డాల్ గానే ఉంటుంది. యంగ్ హీరో అయినా… సీనియర్ హీరో అయినా ఎవ్వరైనా కూడా తన పాత్రకు తగ్గ గ్లామర్ షో చేస్తుంది కాజల్.అయితే తన మొదటి సినిమా లక్ష్మి కల్యాణంలో లంగాఓణిలో అమాయకపు మహాలక్ష్మి లా కళ్యాణ్ రామ్ సరసన నటించింది. మళ్ళీ అప్పటినుండి ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ సరసన నటించలేదు. కానీ మళ్ళీ ఇన్నాళ్లకు కళ్యాణ్ రామ్ తో కలిసి ఎమ్యెల్యే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలోనూ కాజల్ గ్లామర్ షో హద్దులుదాటేలాగే కనబడుతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తో కాజల్ చేసే రొమాన్స్ ఒక రేంజ్ లో ఉండబోతుంది అనేది ఎమ్యెల్యే పోస్టర్స్ తో స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ సినిమాలో కాజల్ గ్లామర్ ఒక రేంజ్ లో అదరగొట్టబోతుంది అనేది మాత్రం పక్కా అండోయ్.ఎమ్యెల్యే పోస్టర్స్ లో కాజల్ ని చూస్తుంటే నడుం అందాలను అలా అలా ఆరబోస్తూ.. కిందకి కట్టిన చీరకట్టుతో అమ్మడు అందాలు అదరగొడుతున్నాయి. మరి ఈ రేంజ్ లో కాజల్ అందాలు ఆరబోస్తుంటే ఈసారి కళ్యాణ్ రామ్ కాజల్ తో కలిసి పక్కాగా హిట్ కొట్టేస్తాడేమో అనిపిస్తుంది. ఇక కాజల్, కళ్యాణ్ రామ్ ల ఎమ్యెల్యే ఈ నెల 23 నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  Article "tagged" as:
  Categories: