కేసీఆర్ రాజకీయాలకు పనికిరాడు : చాడ

కేసీఆర్ రాజకీయాలకు పనికిరాడు : చాడ
March 13 20:35 2018

హైదరాబాద్,
తెలంగాణ శాసనసభ వింతపోకడల పరిణామాలకు వేదిక అయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది మహనీయులు అనేకమైన చర్చలు జరిపిన సభలో వింత పరిణామాలు జరుగుతున్నాయి. కాగితాలు, మైకులు సభాపతి పై విసిరివెయ్యడం పై సిపిఐ వ్యతిరేకిస్తోంది. గతంలో హరీష్ రావు సైతం ఇలాగే చేశారు..ఆయనకు కూడా మేము చెప్పామని అయన అన్నారు. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే సమయంలో సభ్యుల వివరణను, కమిటీ వివరణను తీసుకోవాలి. ఏపీలో రాజాను కూడా సస్పెండ్ చేస్తే కమిటీ రిపోర్ట్స్ తీసుకున్నారు. శాసనసభ సభ్యులను సస్పెండ్ చెయ్యడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నామని అయన అన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేత, శాసనసభ ప్రతిపక్షనేతను సస్పెండ్ చేయడం బాధాకరం. కేసీఆర్ నీతిమంతుడు, బుద్ధిమంతుడు అయినట్లు మాట్లాడుతున్నారు. ఢిల్లీలో కవిత కూడా పార్లమెంట్ లో ప్లకార్డులు చూపిస్తూ నిరసన చేస్తున్నారు కదా..! అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా అని ప్రశ్నించారు. చిన్న తప్పుకు పెద్ద శిక్ష…ఇది సరైన పద్ధతి కాదు. పార్టీ ఫిరాయింల లేఖలను ఎందుకు ఇంకా వెయిటింగ్ లో పెడుతున్నారని చాడ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కి బలం ఉంది కదా అని ప్రజలు, ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోరు. టీఆరెస్ పార్టీకి, ప్రభుత్వానికి నైతికత ఎక్కడ ఉంది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో అధికారం అనుభవించడానికి సిగ్గు ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ బాగోతం త్వరలో బయటకు వస్తది. టీఆరెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చట్టాలను ఉల్లంగిస్తోంది. స్వామిగౌడ్ కన్నుకు గాయం అయినందుకు సిపిఐ పార్టీ విచారం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని అయన హెచ్చరించారు. ప్రతిపక్షాలు విమర్శిస్తే కేసీఆర్ భరించలేడు. రాజకీయాలకు కేసీఆర్ అనర్హుడు. గతంలో వైఎస్ఆర్ హయాంలో అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్ నేర్చుకోవాలని అయన సూచించారు.

  Article "tagged" as:
  Categories: