మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ

మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ
March 23 17:02 2018

న్యూఢిల్లీ,
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ లోకసభ నాయకులు మల్లికార్జున్ ఖర్గే తో ఎంఎల్ ఏ లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్, ఎమ్ ఎల్ సి కోమటి రెడ్డి రాజా గోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఖర్గే ను కలిసి తెలంగాణ అసెంబ్లీ లో జరిగిన అంశాలను పూర్తిగా వివరించారు. చట్ట సభల్లాలోనే చట్ట వ్యతిరేకంగా తమను ఎలాంటి ఆధారాలు లేకుండా తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించారని ఎమ్మెల్యేలు వివరించారు. ఈ నెల 12 వ తేదీన అసెంబ్లీ లో జరిగిన అన్ని రకాల వీడియోలు పేపర్ క్లిప్పింగ్స్, ఉద్దేశ్య పూర్వకంగా తమపై చర్యలు తీసుకున్న అంశాలను ఖర్గే కు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ అందజేసారు. సోమవారం నాడు లోకసభలో అంశాన్ని ప్రస్తావిస్తానని ఖర్గే హామీ ఇచ్చారు.