ఎం.ఎల్‌.ఎ రివ్యూ

ఎం.ఎల్‌.ఎ రివ్యూ
March 23 17:47 2018

నటీనటులు: కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌, పోసాని కృష్ణ మురళి, జయ ప్రకాశ్‌రెడ్డి, రవి కిషన్‌ తదితరులు
మ్యూజిక్: మణిశర్మ
కూర్పు: బక్కిన తమ్మిరాజు
ప్రొడ్యూసర్: కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, విశ్వ ప్రసాద్‌
స్టోరీ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్‌
నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఫస్ట్ నుంచి కమర్షియల్ సినిమాలే చేస్తున్నాడు. ఫక్తు మాస్ కథలతోనే ముందుకు వస్తున్నాడు. పటాస్ తో హిట్ కొట్టి షేర్, ఇజంతో మళ్లీ ఫ్లాపుల్లోకి వెళ్లిన కల్యాణ్ రామ్ ఇప్పుడు ‘ఎం.ఎల్‌.ఎ’ గా ఆడియన్స్ ముందూకు వచ్చాడు. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిగానే కాకుండా ఎమ్మెల్యే గానూ మెప్పిస్తానని ట్రైలర్లోనే చెప్పేశాడు. మరి ఎం.ఎల్.ఏ బాక్సాఫీస్ వద్ద గెలిచాడా..? కల్యాణ్ రామ్ హిట్ కొట్టాడా..?
స్టోరీ: కల్యాణ్‌(కల్యాణ్‌రామ్‌) ఓసారి ఇందు(కాజల్‌)ను చూస్తాడు. చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ ఇందు.. కల్యాణ్ కనిపిస్తే చాలు తప్పించుకుంటుంది. ఈ దశలో ఇందుకు ఓ ప్రాబ్లమ్ ఎదురవుతుంది. దీనిని నుంచి తన తెలివితేటలతో బయటపడేస్తాడు కల్యాణ్‌. దీంతో ఇందు.. కల్యాణ్ ను లవ్ చేస్తుంది. ఇందు తండ్రి జయప్రకాశ్ రెడ్డి.. ఎమ్మెల్యేని తనింటికి అల్లుడుగా చేసుకోవాలనుకుంటాడు. అదే నియోజకవర్గ ఎమ్మెల్యే గాడప్పకు ఇందుని ఇవ్వాలనుకుంటాడు. దీంతో తన ప్రేమ విషయాన్ని జయప్రకాశ్ కు చెప్తాడు కల్యాణ్.. తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఎమ్మెల్యేగా గెలవాలని కండీషన్ పెడతాడు. మరి ఆ ఛాలెంజ్ లో కల్యాణ్ గెలిచాడా..? ఇందుని పెళ్లి చేసుకున్నాడా.? అనేది మిగిలిన స్టోరీ.
ఎలా ఉంది: ఇది పక్కా కమర్షియల్‌ మూవీ, ప్రతి ఫ్రేమూ కమర్షియల్ గానే రూపొందించారు. ఫస్టాఫ్ అంతా హీరోయిన్ ను హీరో ఇంప్రెస్ చేయడంతో రొటీన్ గా గసాగుతుంది. హీరోను మంచి లక్షణాలున్న అబ్బాయిగా చూపించడానికి డైరెక్టర్ ట్రై చేశాడు. కబ్జా అయిన ఇందు ఆస్తిని తిరిగిప్పించడం బాగానే ఉన్నా.. ఆ సీన్లలో లాజిక్ ఉండదు. కానీ ఆడియన్స్ కు మంచి వినోదం దొరకుతుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమ్మెల్యే అవడానికి హీరో చేసే ప్రయత్నంతో సాగుతుంది. కమర్షియల్‌ అంశాలతో పాటు పిల్లలకు చదువు ఎంత అవసరమో చెప్పేలా కొన్ని సీన్స్ బాగున్నాయి. అన్ని సీన్సు ముందుగానే తెలిసిపోయినా.. వాటిలో వినోదం మాత్రం మిస్ కాలేదు. మధ్యమద్యలో పంచ్ డైలాగ్స్, ఫైట్లు బాగానే ఉన్నాయి.
ఎలా చేశారు: పటాస్ సినిమా నుంచి కల్యాణ్ రామ్ లో మార్పొచ్చింది. నటనలో ఈజ్ తో పాటు స్టైల్ తోనూ ఆకట్టుకున్నాడు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. కాజల్ పాత్రకు మంచి స్కోపే ఉన్నా..సెకండ్ హాఫ్ లో కేవలం పాటలకే పరిమితమైంది. రవికిషన్ రేసు గుర్రంలాంటి పాత్రతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి నవ్వించారు. మణిశర్మ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డెరెక్టర్ కు తొలి సినిమా అయినా పాస్ మార్కులు కొట్టేశాడు.
ప్లస్ పాయింట్స్:
+ ఎంటర్ టైన్ మెంట్
+ కమర్షియల్‌ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్
– రొటీన్‌ స్టోరీ

  Article "tagged" as:
  Categories: