నీదీ నాదీ ఒకే కథ రివ్యూ

నీదీ నాదీ ఒకే కథ  రివ్యూ
March 23 17:49 2018

నటీనటులు: శ్రీ విష్ణు.. సత్నా టిటస్‌.. దేవీ ప్రసాద్‌ తదితరులు
మ్యూజిక్: సురేష్‌ బొబ్బిలి
ప్రొడ్యూసర్: ప్రశాంతి, కృష్ణ విజయ్‌
స్టోరీ , స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు వూడుగుల
టాలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ మార్కులు కొట్టేస్తున్నాడు శ్రీ విష్ణు. ఓ వైపు హీరోగా.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు డిఫరెంట్ స్టోరీలనే చేసిన విష్ణు మరోసారి అలాంటి సినిమాతోనే వచ్చాడు. ఓ సామాన్యుడి స్టోరీగా ట్రైలర్లు, పబ్లిసిటీలో చెప్పారు. శ్రీవిష్ణు చేసిన మరో ప్రయత్నం ఎలా ఉంది? డెబ్యూ డైరెక్టర్ వేణు వూడుగల ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు?
స్టోరీ: నాలుగు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న రుద్రరాజు దేవీ ప్రసాద్‌(దేవీ ప్రసాద్‌) కుమారుడు రుద్రరాజు సాగర్‌ (శ్రీ విష్ణు). పేరుకు టీచర్ కు కొడుకే అయినా.. చదువుల్లో మాత్రం చాలా పూర్. ఎప్పుడూ పరీక్షల్లో ఫెయిల్ అవుతుంటాడు. చదువు ఎక్కదు.. చదువుంటే భయం. కానీ తండ్రికి కోసం ఏదో సాధించాలని తపన పడుతుంటాడు. ఇందుకోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతుంటాడు.. అవే వీడియోలు చూస్తుంటాడు. తన తండ్రికి నచ్చేలా ఉండటానికి ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో సాగర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. లైఫ్ లో సెటిల్ అవడం అంటే ఎంటో హీరో చెప్పిన నిర్వచనమే మిగిలిన స్టోరీ.
ఎలా ఉంది?: లైఫ్ సెటిల్ అవడం అంటే.. డబ్బు సంపాదించడమేనా.. అనే పాయింట్ చుట్టూ నడిచే స్టోరీ ఇది. పర్సనాలిటీ మేనేజ్ మెంట్ తో పాటు వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పే మాటలన్ని అబద్ధాలేనని సినిమలో సూటిగా చెప్పారు. సాగర్ క్యారెక్టర్ ను మలిచిన విధానం బావుంది. ఈ జనరేషన్ యూత్ కు చాలా దగ్గరగా ఉండే క్యారెక్టర్ అది. ప్రతి సీన్లో.. పాత్రల మధ్య ఎమోషన్స్ బాగా పండాయి. ఎగ్జామ్స్ కోసం కుర్రాళ్లు పడే కష్టాలు, పిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకునే ఆశలు, చేసే ఒత్తిడి లాంటి అంశాలు నిజజీవితంలో మాదిరిగానే చూపించాడు. చెప్పే చిత్రం ఇది. భవిష్యత్‌లో ఏదో కావాలని చిన్న చిన్న ఆనందాలను వదిలేసి వెంపర్లాడే ఈ తరానికి కళ్లకు కట్టేలా గట్టి సందేశాన్ని ఇచ్చింది.
ఎలా చేశారు: శ్రీవిష్ణు తన కెరీర్‌లో మరోసారి మంచి నటన చూపించాడు. సాగర్ రోల్ కు వందశాతం న్యాయం చేశాడు. హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం దక్కింది. హీరో తండ్రిగా దేవీ ప్రసాద్.. దాదాపు హీరో పాత్రనే పోషించాడు. ఒక మిడిల్ క్లాస్ తండ్రిగా చాలా నాచురల్ గా చేశాడు. మ్యూజిక్ తో పాటు చక్కగా అర్థమయ్యే పాటలతో సినిమాను మరింత షైన్ చేశాడు. ఎక్కడా ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా సినిమాను తీశు. ప్లస్
పాయింట్స్
+ స్టోరీ
+ శ్రీవిష్ణు, దేవీ ప్రసాద్‌ల నటన
+ ఎమోషనల్ సీన్స్
బలహీనతలు
-స్లో నేరేషన్