పయ్యావుల వారి పెళ్లి కోసం అసెంబ్లీకి సెలవు

పయ్యావుల వారి పెళ్లి కోసం అసెంబ్లీకి సెలవు
November 23 21:23 2017
తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత మహిళ శమంతకమణి (ఎమ్మెల్సీ) మనవరాలి వివాహానికి హాజరై కాలేదు కేవలం దళిత అనే కారణంతో పెద్దగా పట్టించుకోలేదు…..
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో ఉన్న తెలుగుదేశంలో నాయకుల కోసం అసెంబ్లీకి ఏకంగా సెలవు ప్రకటించారు ఇది తెలుగుదేశం పాలన….ఛీ ఛీ
అసెంబ్లీ సమావేశాలను షెడ్యూల్‌కు భిన్నంగా విరామం ప్రకటించడంపై రచ్చజరుగుతోంది. ప్రతిపక్షం లేకుండా అధికారపక్షమే సభ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో టీడీపీ సభ్యుల నిర్ణయం మేరకు సభకు 23, 24, 25 తేదీల్లో విరామం ప్రకటించారు.
తిరిగి 27న అసెంబ్లీ భేటీ కానుంది. అయితే అసెంబ్లీకి ఇలా విరామం ప్రకటించడానికి ప్రధాన కారణం టీడీపీ నేతల ఇంట వివాహాలేనని చెబుతున్నారు. ఇదే అంశంపై …. శాసనసభ వ్యవహారాల ఇన్‌చార్జ్ యనమల రామకృష్ణుడిని నిలదీశారు. ఈనెల 16న శమంతకమణి మనవరాలి వివాహం జరిగింది. పెళ్లికి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ప్రజాప్రతినిధులను ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించారు. కానీ ఎవరూ పెద్దగా హాజరుకాలేదు.
అదే రోజు మంత్రులు, ఎమ్మెల్యేలను లోకేష్‌ పోలవరం ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో యనమలను నిలదీశారు శమంతకమణి. దళితులమైన తమ ఇళ్లలో వివాహానికి ఎవరూ రాకుండా చేశారు. ఇప్పుడు మీ పెద్దోళ్ల ఇళ్లలో పెళ్లి అనగానే అసెంబ్లీకి ఏకంగా సెలవు ప్రకటిస్తారా అని నిలదీశారామె. మా దళితులకు ఎలాగో పదవులు ఇవ్వరు. గౌరవం ఎటూ లేదు. కనీసం మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఎవరూ రాకుండా పోలవరం ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళ్తారా?.
ఈనెల 16న నా మనవరాలు వివాహం జరిగితే మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించా కానీ ఎవరినీ రానివ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనివాస్ కుమార్తె వివాహం జరుగుతుంటే మాత్రం ఏకంగా శాసనసభ, శాసనమండలికి సెలవు ప్రకటిస్తారా ఇదేం న్యాయం అని శమంతకమణి ప్రశ్నించారు. శమంతకమణి అడిగిన ప్రశ్నలకు యనమల సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. ఈనెల 23న పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనివాస్ కుమార్తె వివాహం.. కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ కుమారుడితో జరగనుంది. మొత్తం మీద అసెంబ్లీ విరామం వెనుక ఇంతకథ ఉందన్నమాట
(ఎగ్గులశ్రీనివాసులు)
  Article "tagged" as:
  Categories: