ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి
March 14 13:30 2018

లండన్,
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ బుధవారం కన్నుమూశారు. చిన్న నాటి నుంచే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హాకింగ్, నాటి ఉంచి కుర్చీకే పరిమితమయ్యారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 76 ఏళ్ల హాకింగ్…కృష్ణబిలాలపై అనేక పరిశోధనలు చేశారు. 1942 జనవరి 8న ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్స్ లో హాకింగ్ జన్మించారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే. ఆయన ఆక్స్ ఫర్డ్ లోని సెయింట్ ఆల్బన్స్ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. హాకింగ్ రేడియేషన్, పెన్ రోజ్, హాకింగ్ ఫార్ములా, హాకింగ్ ఎనర్జీ, గిబ్సన్స్ – హాకింగ్ అన్సాట్జ్, ధ్రోన్ హాకింగ్ ప్రీస్కిల్ బెట్ వంటి ఆయన సిద్ధాంతాలు ఉత్సాహిక శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. 1965లో జేన్ విల్డీని వివాహం చేసుకున్న ఆయన, 1995లో విడాకులు ఇచ్చి అదే సంవత్సరం ఎలానీ మాసన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 2006లో విడాకులు ఇచ్చారు. హాకింగ్స్ కు ముగ్గురు పిల్లలు
అంతేగాకుండా ప్రపంచంలోని పలు విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు చేశారు. బ్రిటన్ లోని కేంబ్రిడ్స్ యూనివర్సిటీలో వివిధ హోదాల్లో హాకింగ్ పనిచేశారు. బ్లాక్ హోల్స్ పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో అతిపెద్ద విప్లవం సృష్టించాయి. హాకింగ్ ఐక్యూ లెవల్ ఐన్స్టీన్ ఐక్యూతో సమానంగా ఉండేది. ఖగోళ భౌతిక శాస్త్రంపై పలు పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాలకు కూడా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, ద గ్రాండ్ డిజైన్, బ్లాక్ హోల్స్ అండ్ బేబీ యూనివర్సెస్, మై బ్రీఫ్ హిస్టరీ లాంటి పుస్తకాలెన్నో ఆయన రచించారు. ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకమైతే ఏకంగా 40 భాషల్లోకి అనువాదం అయ్యింది. తెలుగులో కాలం కథ పేరుతో అచ్చయ్యింది. హాకింగ్ పై 2014లో ది థియరీ ఆఫ్ ఎన్విరిథింగ్ సినిమా వచ్చింది. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల విచారం వ్యక్తం చేశారు. స్టీఫెన్ హాకింగ్ మృతితో ఈరోజు గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

  Article "tagged" as:
  Categories: