దుబాయ్ రాజు కల్పించుకోవడంతో మారిన సీన్

దుబాయ్ రాజు కల్పించుకోవడంతో మారిన సీన్
February 28 14:03 2018
దుబాయ్,
అనుమానాలు తీరలేదు. కానీ అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకువచ్చారు. మూడు రోజుల తర్వాత ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ముంబైకి ప్రత్యేక ప్లైట్ లో తీసుకువచ్చారు. అందాల తార భౌతికకాయంతో బోనీ కపూర్‌, ఇతర కుటుంబీకులు దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకుని ముంబైకి చేరారు. ముందుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఇతర ప్రక్రియలు పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. అనంతరం విమానం బయలు దేరింది. ముఖేష్ అంబానీ పంపిన ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో భౌతికకాయాన్ని ముంబయికి తరలించారు. మూడు రోజులుగా ఆమె కోసం ఆ విమానాన్ని ఎయిర్ పోర్టులోనే ఉంచారు అంబానీ.
అభిమాన తార కోసం అభిమానులు ఎదురు చూశారు. ముంబయిలో తొలుత ఇంటికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్ధం మహబూబ్‌ స్టూడియోలో ఉంచుతారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించన్నారు. వెండితెర వేలుపు శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. అత్యంత భావోద్వేగ సమయంలో తమకు అండగా నిలిచిన మీడియాకు భర్త బోనీ కపూర్‌, కుమార్తెలు ఖుషి, జాహ్నవితో పాటు కపూర్‌, అయ్యప్పన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.. కడసారి శ్రీదేవిని చూసేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ తారలు ముంబైకి చేరుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్ వంటి వారు ఇప్పటికే అక్కడకు చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై సినీ పరిశ్రమ షూటింగ్ లను బంద్ చేసి అందాల తార కోసం ఎదురు చూస్తున్నారు. లెజండరీ నటి శ్రీదేవి మృతి కేసును మూసేసినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపింది. పోలీసులు, ఫోరెన్సిక్ రిపోర్టులలో ఎలాంటి లోపం లేదని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. ఇందుకు దుబాయ్ రాజు ప్రభావం చూపారనే అనుమానం వస్తోంది. శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు చెబుతున్నారు. కానీ ఆమె ఆల్కాహాల్ ఎందుకు తీసుకుంది..ఎంత సేపు బోనీ కపూర్ ను విచారించారు. అక్కడ అసలు ఏం జరిగింది. ఏంటనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇక బయటకు వచ్చే వీలు లేదు. శ్రీదేవి బంధువులు ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు ప్రకటించగా.. పోస్టుమార్టం రిపోర్టులో ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి ఊపిరాడక మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఫలితంగా ఇంకా సందేహాలు తొలగలేదు. ఆస్తి తగాదాలే ఆమె మృతికి కారణం అయింది అనేది అందరికీ అర్థమవుతోంది. అదే సమయంలో బోనీకపూర్ మొదటి భార్య మోనా కుమారుడు అర్జున్ కపూర్ తోను గొడవలు వచ్చాయంటున్నారు. మరికొద్ది రోజులు వెళితేగానీ ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు