సీనియ‌ర్ న‌టుడు వంకాయ‌ల మృతి

సీనియ‌ర్ న‌టుడు వంకాయ‌ల  మృతి
March 12 18:51 2018

హైదరాబాద్
తెలుగు చ‌ల‌న‌చిత్ర పరిశ్ర‌మ సీనియ‌ర్ న‌టుడు వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ (78)మృతి చెందారు. కొంత‌కాలంగా శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం క‌న్నుమూశారు. స‌త్య‌నారాయ‌ణ 1940వ సంవ‌త్స‌రం, డిసెంబ‌ర్ 28వ తేదీన విశాఖ‌ప‌ట్నంలో జ‌న్మించారు. న‌ట‌న మీద ఆస‌క్తితో సినిమా రంగంలోకి వ‌చ్చి ప‌లు చిత్రాల్లో క్యారెక్ట‌రు ఆర్టిస్టుగా న‌టించారు.న కెరీర్‌లో దాదాపు 180 సినిమాలు, ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించారు. బికామ్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన వంకాయ‌ల..1960 ఆగ‌స్టులో షూటింగ్ కాంపిటీష‌న్‌లో దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిచారు. చ‌దువు, ఆట‌ల్లో ప్ర‌తిభ కార‌ణంగా హిందుస్థాన్ షిప్‌యార్డులో మంచి ఉద్యోగం వ‌చ్చిన‌ప్ప‌టికీ న‌ట‌న అంటే ఉన్న ఇష్టంతో సినిమా రంగంవైపు అడుగులేశారు. నీడ లేని ఆడ‌ది, సినిమాతో అరంగేట్రంచేసినస‌త్యనారాయ‌ణ..సూత్ర‌ధారులు, సీతామ‌హాల‌క్ష్మి, దొంగ‌కోళ్లు, ఊరికిచ్చినమాట‌, విజేత‌, శ్రీనివాస క‌ల్యాణం. లాంటి సినిమాల్లో న‌టించారు.