శ్రీ సత్య సాయి సర్వీసింగ్ వింగ్ గోల్డన్ జూబిలీ ఉత్సవాలు

శ్రీ సత్య సాయి సర్వీసింగ్ వింగ్  గోల్డన్ జూబిలీ ఉత్సవాలు
March 23 18:01 2018

హైదరాబాద్
పుట్టపర్తి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థ శ్రీసత్యసాయి సేవా ఆర్గనైజేషన్(ఎస్ఎస్ఎస్ఎస్ఓ), తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ శాఖల శ్రీ సత్య సాయి సర్వీసింగ్ వింగ్ యొక్క గోల్డన్ జూబిలీ ఉత్సవాలనునిర్వహిస్తున్నట్లు ఎస్ఎస్ఎస్ఎస్ఓ జాతీయ అధ్యక్షులు నిమిష్ పాండ్య తెలిపారు.ఈ నెల 25 నుండి మొదలయ్యి ఏప్రిల్ 4న ముగియనున్న ఈ ఉత్సవాలలో సత్య సేవా సంస్థలు రెగ్యులర్గా చేసే కార్యక్రమాలతో పాటు శ్రీ సత్య సాయి సర్విస్వింగ్కు 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భముగా మరికొన్ని ఉపయుక్తమైన కార్యక్రమాలను ఎస్ఎస్ఎస్ఎస్ఓ నిర్వహింపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భముగా, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని జంటనగరాలలో 23 వివిధ ప్రదేశాలలో మంచినీటి క్యాంప్లను, పేదలకు ఉచితముగా పాదరక్షల పంపిణి, హైదరాబాద్ రూరల్ ప్రదేశాలలో రిమోట్ ఒకేషనల్ శిక్షణ స్కీం కిట్ల పంపిణి, మహిళలకు గాజుల తయారి, బ్యూటి, ఫ్యాషన్, టైలరింగ్, మెహంది రంగములో శిక్షణ మరియు పేదలకు ఉచిత ఆహార పంపిణి, వివిధ ప్రదేశాలలో మెడికల్ క్యాంప్లకు ఆధునిక సదుపాయాలతో మొబైల్ మెడికల్ యునిట్లు వంటి వివిధ ఉపయుక్తమైన కార్యక్రమాలను ఎస్ఎస్ఎస్ఎస్ఓ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలన్ని జంటనగరాలలోని వివిధ పరిసర ప్రదేశాలలో జరుగగా, ముగింపు ఉత్సవాలు ఏప్రిల్ 4వ తేదీన శివం టెంపుల్లో జరుగుతాయని తెలిపారు.ఈ ఉత్సవాల సందర్భముగా ఎస్ఎస్ఎస్ఎస్ఓ జాతీయ టీంతో పాటు ఎస్ఎస్ఎస్ఎస్ఓ జాతీయ అధ్యక్షులు నిమిష్ పాండ్య హాజరు అవుతారు. ఈ ఉత్సవాలను ఈ నెల 25న హైదరాబాద్ బాగ్ అంబర్ పేట లో ఉన్న శ్రీ సత్య సాయి విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో హెచ్.జే.దొర (రిటైర్డ్ ఐపియస్, శ్రీ సత్య సాయి ట్రస్ట్ తెలంగాణ,ఏపి ప్రస్తుత కన్వీనర్) ప్రారంభిస్తారని తెలిపారు.