సుధారాణి అంతిమ యాత్ర

March 13 16:22 2018

సీనియర్ ఎడిటర్ ఎబికె ప్రసాద్ గారి సహచరి శ్రీమతి సుధారాణి గారు కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. మేడం కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతున్నారు. ‌ఎబికె సన్నిహితులు, శిష్యులకు సుధారాణి గారి ఆత్మీయ పలకరింపు తెలిసిందే. మేడం భౌతిక కాయాన్ని నగరశివారులోని సిఅర్ ఫౌండేషన్ లో అభిమానుల కడసారి నివాళి కోసం ఉంచుతారు, అనంతరం మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారం నిర్వహిస్తారు