ప్రభుత్వం కక్ష సాధిస్తోంది

ప్రభుత్వం కక్ష సాధిస్తోంది
March 13 20:00 2018

అనంతపురం,
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది వైస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి విమర్శించారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్న డిమాండ్ తో వైఎస్‌ఆర్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి రెడ్డి చేపట్టిన ‘ జలసంకల్ప యాత్ర’లో భాగంగా మంగళవారం వజ్రకరూరు మండలంలోని ధర్మపురిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే 90 శాతం హంద్రీనీవా పనులు పూర్తయ్యాయనీ, పిల్లకాలువలు పూర్తిచేస్తే పొలాలకు నీరు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. పయ్యావుల కేశవ్‌కు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, కరవును తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిచ్చేదాకా పోరాటం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు.

  Article "tagged" as:
  Categories: