ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి :  మేళ్ళం భాగ్యారావు పిలుపు

March 05 10:16 2018
 పదిమంది ముద్దాయిలను కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు, అధికారులతో సహా స్వయంగా ముఖ్య మంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని ఈ దశలో దళితులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళ్ళం భాగ్యారావు పిలుపు నిచ్చారు. యాభైకి పైగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన దళితుల ఆత్మగౌరవ సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెద గొట్టిపాడులో దళితులపై ఆధిపత్య కులం దాడిచేసి మూడు నెలల గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ, తమ కులం వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న సర్కారుకు గట్టిగా బుద్దిచెప్పాలని ఆయన కోరారు.‌
  Article "tagged" as:
  Categories: