గ్రామాల్లో పరిస్థితి బాగా మెరుగుపడింది: జూపల్లి

గ్రామాల్లో పరిస్థితి బాగా మెరుగుపడింది: జూపల్లి
March 23 18:14 2018

హైదరాబాద్
గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలోని గ్రామాల్లో పరిస్థితి బాగా మెరుగుపరిచామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గ్రామాలు పచ్చగా ఉండాలి.. గ్రామీణ ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శాసనసభలో ఆర్థిక పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి అంశంలో మార్పు వచ్చింది. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.ఆసరా పథకం కింద 39 లక్షల మందికి పింఛన్ల రూపంలో రూ. 5,300కోట్ల ఇస్తున్నారు. రాష్ట్రంలో బీటీ రోడ్లను మరమ్మతు చేస్తున్నాం. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో రూ. 1460కోట్లతో గ్రామాల్లో హరితహారం చేపట్టామని తెలిపారు. మిషన్ భగీరథలో భాగంగా 22వేల గ్రామాలకు తాగు నీరు అందించబోతున్నామని చెప్పారు. 4,500ల గ్రామాల్ల్లో వైకుంఠధామాలు నిర్మించామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీల నిధులతోనే సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు.గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో7 వేల డంప్‌యార్డ్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. పట్టణాల్లో మాదిరిగానే గ్రామాల్లో చెత్తను తరలించేందుకు22 వేలకు పైగా ట్రైసైకిళ్లను పంపిణీ చేశామన్నారు. ప్రతీ గ్రామం కూడా ఓడీఎఫ్‌గా ఉండాలనే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రతీ గ్రామంలో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలనే కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వచ్చే కొన్ని నెలల్లో వంద శాతం అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతీ ఇంటి ఆవరణలో మురికి నీరు చేరకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సమూలంగా మార్చబోతున్నాం. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చబోతున్నామని మంత్రి ఉద్ఘాటించారు.

  Article "tagged" as:
  Categories: