గెలిపించినవారే ఆరోపణలు చేస్తున్నారు : విజయసాయి

గెలిపించినవారే ఆరోపణలు చేస్తున్నారు : విజయసాయి
March 22 17:56 2018

న్యూఢిల్లీ,
తెదేపా ఆధ్యక్షుడు, ముఖ్యమంత్రికి చంద్రబాబుకు సూటి ప్రశ్న వేస్తున్నారు. అయన ప్రజలకు జవాబు చెప్పాలి. భాజపా నేతలు విష్ణుకుమార్, సోము వీర్రాజు, జనసేన పవన్ లు తెదేపా ను బలపరిచి అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు వారే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి ధనాన్ని పోగు చేశారు.. దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. మీకు మీరే నిజానిర్దారణ చేసుకోవాలి. మీరు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాలి. మీ అంతట మీరే సీబీఐ విచారణ వేయించుకోవాలి. వారంలోగా సీబీఐ విచారణకు అదేశించుకోకపోతే అవినీతికి పాల్పడ్డట్లేనని అయన వ్యాఖ్యానించారు.