క్షయ వ్యాధిని 2025లోగా రూపుమాపుతాం:మోదీ

క్షయ వ్యాధిని 2025లోగా రూపుమాపుతాం:మోదీ
March 13 20:02 2018

న్యూఢిల్లీ
క్షయ వ్యాధిని 2025లోగా రూపుమాపుతామని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఆయన టీబీ సదస్సును ప్రారంభించారు. ప్రపంచం నుంచి టీబీని తరిమేందుకు2030 వరకు డెడ్‌లైన్ పెట్టుకున్నారని, కానీ భారత్‌లో అయిదేళ్లు ముందుగానే, అంటే 2025 లోపే టీబీని అంతం చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. విదేశాలకు చెందిన అనేక మంది నేతలు టీబీ సదస్సుకు హాజరయ్యారు. టీబీ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మొదలుపెట్టారు. పరిస్థితిని సమీక్షించి.. వ్యాధిని అరికట్టేందుకు కావాల్సిన చర్యలను చేపట్టాలని ఆయన సూచించారు. టీబీని నిర్మూలించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీబీ నిర్మూలనకు చేయూతనివ్వాలన్నారు. టీబీపై పోరాటం చేయాలని అన్ని ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లు మోదీ తెలిపారు. భారత్‌లో టీబీ ఇంకా ప్రబలుతున్నదని, ముఖ్యంగా పేదల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నదన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ, డబ్ల్యుహెచ్‌వోలు సంయుక్తంగా ఈ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించాయి. 2016లో టీబీ వల్ల సుమారు 17లక్షల మంది మరణించారు.

  Article "tagged" as:
  Categories: